బాల్యవివాహాలను రద్దు చేసేందుకు సర్వశిక్షా అభియా¯ŒS ద్వారా ‘పది తర్వాత పెళ్లికాదు.. 11వ తరగతి’ అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ హెచ్‌ఆర్.అరుణ్‌కుమార్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ గురువారం
‘10 తర్వాత పెళ్లి వద్దు’ పోస్టర్ ఆవిష్కరణ
Mar 30 2017 11:40 PM | Updated on Sep 5 2017 7:30 AM
భానుగుడి (కాకినాడ):
బాల్యవివాహాలను రద్దు చేసేందుకు సర్వశిక్షా అభియా¯ŒS ద్వారా ‘పది తర్వాత పెళ్లికాదు.. 11వ తరగతి’ అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ హెచ్‌ఆర్.అరుణ్‌కుమార్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ గురువారం ఆవిష్కరించి బాలికావిద్యను ప్రగతి పథలో పెట్టేందుకు రూపొందించిన కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 352 కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాల్యవివాహాలపై అవగాహన కల్గించేందుకు ప్రతీ పాఠశాలకు ఒక సైకియాట్రిస్ట్, విద్యావేత్త ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు పీవో మేకా శేషగిరి తెలిపారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 8, మైదానప్రాంతాల్లో 2, ముంపు మండలాల్లో 2 మొత్తం 12కేజీబీవీలు ఉన్నాయని, వీటిలో 2,400 మంది విద్యార్థినులు చదువుతున్నారని, వారిలో 400 మంది పదోతరగతి చదువుతున్నారన్నారు. వీరందరికీ ఈనెల 30,31 తేదీలలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సీఎంవో ఇంటి వెంకట్రావు, ఏఎంవో చామంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement