నరసాపురం రూరల్ : మండలంలోని స్వర్ణాంధ్ర విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం 21వ అంతర పాలిటెక్నికల్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభం అయ్యా యి.
పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం
Dec 11 2016 12:16 AM | Updated on Sep 4 2017 10:23 PM
నరసాపురం రూరల్ : మండలంలోని స్వర్ణాంధ్ర విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం 21వ అంతర పాలిటెక్నికల్ జిల్లా స్థాయి క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభం అయ్యా యి. తొలుత ఈ పోటీలను ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మున్సిపల్ చైర్ పర్స న్ రత్నమాల క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంబించారు. కాకినాడకు చెందిన టెక్నికల్ ఎడ్యుకేషన్ రీజనల్ డైరెక్టర్ జె. సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ డిపార్డ్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రా యూనివర్సిటీ రీజనల్ డైరెక్టర్ కాకినాడ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. సర్పంచ్ అడబాల అయ్యప్పనాయుడు, ప్రిన్సిపాళ్లు శ్రీనివాసకుమార్, తెన్నేటి మధు, పోలిటెక్నికల్ కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, వ్యాయామోపాధ్యాయులు, కే ఎస్వీస్‌ఎస్ మూర్తి, వి.జయచంద్ర, పి.నరసింహరాజు, కుమార్‌రాజు, నర్సింహరావు, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement