కంకర మిషన్ ప్రాంగణాల్లో మొక్కలు నాటి. కాలుష్యాన్ని నివారించాలని గనుల శాఖ (మైన్స్) డిప్యూటీ డైరెక్టర్ కె.యాదగిరి సూచించారు.
కమ్మర్‌పల్లి : కంకర మిషన్ ప్రాంగణాల్లో మొక్కలు నాటి. కాలుష్యాన్ని నివారించాలని గనుల శాఖ (మైన్స్) డిప్యూటీ డైరెక్టర్ కె.యాదగిరి సూచించారు. హరితహారంలో భాగంగా శనివారం మండల కేంద్ర శివారులోని కంకర మిషన్ వద్ద ఆయన మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మైన్స్ ఏడీ సైదులు, టెక్నికల్ అసిస్టెంట్ నర్సింగ్ రమేశ్, సాయిరాం, సీనియర్ అసిస్టెంట్ గోవర్ధన్, జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్, కంకర మిషన్ నిర్వాహకుడు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.