భక్తులారా.. జరభద్రం..! | plz alert | Sakshi
Sakshi News home page

భక్తులారా.. జరభద్రం..!

Aug 3 2016 12:31 AM | Updated on Sep 4 2017 7:30 AM

భక్తులారా.. జరభద్రం..!

భక్తులారా.. జరభద్రం..!

విజయపురిసౌత్‌లోని కృష్ణవేణి ఘాట్‌ సమీపంలో జలాశయం లోతు ఎక్కువగా ఉంటుంది. సాగర్‌ సందర్శించే పర్యాటకులు సరదాగా నీటిలో స్నానం చేయటానికి దిగి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రాంతంలో 2013వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నలుగురు నీటిలో మునిగి మృతి చెందారు. దిగువ కృష్ణానదిలో పడిపోయిన బ్రిడ్జి వద్ద స్నానానికి దిగి గత మూడేళ్లలో ముగ్గురు అనంతలోకాలకు వెళ్లారు.

విజయపురిసౌత్‌ : 

దీనికి సమీపంలోనే దేశాలమ్మగుడి వద్ద పుష్కర ‡ఘాట్‌ను ఏర్పాటు చేశారు. సాగర్‌మాత దేవాలయం వద్ద స్నానాలకు దిగి నాలుగేళ్లలో ఏడుగురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కళ్లు తెరవకుండా ఘాట్ల భద్రతను గాలికొదిలింది. దీనికి ఈ చిత్రాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 
 
Advertisement

పోల్

Advertisement