ఉప్మాలో పిన్నీస్‌ | pinnis cought in upma | Sakshi
Sakshi News home page

ఉప్మాలో పిన్నీస్‌

Jul 25 2016 7:29 AM | Updated on Sep 4 2017 6:04 AM

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఆదివారం రోగులకు అల్పాహారంగా ఉప్మా పెట్టారు. అందులో ఓరోగికి పెట్టిన ఉప్మా ప్లేటులో పిన్నీస్‌ ప్రత్యక్షమైంది.

జీజీహెచ్‌లో చోటు చేసుకున్న సంఘటన
గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఆదివారం రోగులకు అల్పాహారంగా ఉప్మా పెట్టారు. అందులో ఓరోగికి పెట్టిన ఉప్మా ప్లేటులో పిన్నీస్‌ ప్రత్యక్షమైంది. ఉప్మాను నోటిలో పెట్టుకున్న సమయంలో నాలుకకు గుచ్చుకోవడంతో ఒక్కసారిగా కంగారు పడిన రోగి ఉప్మాను బయటకు తీయడంతో పిన్నీస్‌ కనిపించింది. దీంతో ఆసుపత్రి అధికారులకు రోగి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మాచర్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన రాగం లక్ష్మీనారాయణ రక్తహీనతతో బాధపడుతూ చికిత్స కోసం ఈనెల 21న జీజీహెచ్‌లోని 102 నంబర్‌ వార్డులో చేరాడు. ఆసుపత్రి ఇన్‌పేషెంట్‌ రోగులకు ప్రభుత్వం ఉచితంగా కాంట్రాక్టర్‌ ద్వారా ఆహార పదార్థాలు అందజేస్తుంది.

ఆదివారం లక్ష్మీనారాయణకు అల్పాహారం తీసుకొచ్చేందుకు తల్లి సామ్రాజ్యం అల్పాహారం పెట్టే బండి వద్దకు వెళ్ళి తీసుకొచ్చి కుమారుడికి ఇచ్చింది. రెండుముద్దలు తిన్న పిదప మూడో ముద్ద తినే సమయంలో నాలుకకు గుచ్చుకోవడంతో ఉప్మాను బయటకు ఊయడంతో పిన్నీస్‌ బయటపడింది. ఉప్మాను వడ్డించిన వారికి, నర్సింగ్‌ సిబ్బందికి విషయాన్ని తెలియజేసి తదుపరి ఆర్‌ఎంవో డాక్టర్‌ యనమల రమేష్‌కు బాధితుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కాగా, ఈవిషయంపై ఆసుపత్రి డైటీషియన్‌ రవికుమార్, కాంట్రాక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆహార పదార్థాలు తయారు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, తమ వద్ద వండిన పదార్థాల్లో అలాంటివి ఉండవని పేర్కొన్నారు. కావాలనే కొందరు తమ పై బురదజల్లేందుకు ఈవిధంగాచేసి ఉండవచ్చని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement