ఉద్యోగావకాశాల కోసం ఎన్టీపీసీ నిర్వాసితుల ధర్నా | People protests at ramagundam NTPC | Sakshi
Sakshi News home page

ఉద్యోగావకాశాల కోసం ఎన్టీపీసీ నిర్వాసితుల ధర్నా

Aug 11 2015 2:13 PM | Updated on Sep 3 2017 7:14 AM

కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ వద్ద ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ వద్ద ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఒప్పందం ప్రకారం నిర్వాసిత కుటుంబాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ మంగళవారం మధ్యాహ్నం ఎన్టీపీసీ వద్ద నిరసన తెలిపారు. దీంతో ఎన్టీపీసీ విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టు కోసం గతంలో రామగుండం మండలంలోని వివిధ గ్రామాల ప్రజల భూములను ప్రభుత్వం సేకరించింది. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగాలు కల్పించాలని ప్రాజెక్టు భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement