ప్రతిపక్షాలది డ్రామా | opposition parties playing drama | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలది డ్రామా

Jul 25 2016 11:49 PM | Updated on Sep 4 2017 6:14 AM

ప్రతిపక్షాలది డ్రామా

ప్రతిపక్షాలది డ్రామా

రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

–అభివృద్ధి అంటే ఏమిటో కేసీఆర్‌ చేసి చూపిస్తుండ్రు
–రిజిస్ట్రేషన్ల ద్వారా పెరిగిన ఆదాయం
–భువనగిరి సభలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ
భువనగిరి : రాష్ట్ర అభివృద్ధికి సహకరించకుండా ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. భువనగిరిలో నూతనంగా నిర్మిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనం పనులకు సోమవారం విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో  కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఏమిలో సీఎం కేసీఆర్‌ చేసి చూపుతున్నారని తెలిపారు.   గడచిచిన మూడేళ్లలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరుగుతూ వచ్చిందన్నారు.  
ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి
 ప్రాజెక్ట్‌లను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి హితవుపలికారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి  అడ్డుపడుతున్న కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులను గ్రామాల్లోకి రానీయెుద్దన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్ట్‌లు కట్టి తీరుతామని పేర్కొన్నారు. అంతకుముందు రిజిస్టార్‌ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.  ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అండ్‌ స్టాంప్‌ ఐజీ, కమిషనర్‌ ఆహ్మద్‌ నదీమ్, జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సత్యనారాయణ,  డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్‌ జనరల్‌ మధుసూదన్‌రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్‌ వాసుదేవారావు, సబ్‌రిజస్ట్రార్‌ సామల సహదేవ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుర్విలావణ్య, కౌన్సెలర్‌ బోగ వెంకటేష్, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మారగోని రాముగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ సీఎం
 యాదగిరిగుట్ట: దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ, ప్రజలకు వందశాతం సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌.. డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. యాదగిరిగుట్టలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పనులకు సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వంద సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి చేసిందన్నారు. రాష్ట్రానికి  కేసీఆర్‌ సీఎం కావడం మన అదృష్టమన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్నారని పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అభివృద్ధి కోసం రూ.30వేల కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుందన్నారు. అంతే కాకుండా కరువుతో కొట్టుమిట్టాడుతున్న  రైతాంగానికి 9 గంటల కరెంట్,  విద్యారు«్థలకు మధ్యాహ్న బోజనం కల్పిస్తున్నారని పేర్కొన్నారు.  పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల ద్వారా జిల్లాకు నీళ్లు తీసుకువచ్చి ఫ్లోరైడ్‌ రక్కసిని పారదోలాలని సీఎం కృతనిశచ్చయంతో ఉన్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అండ్‌ స్టాంప్‌ ఐజీ, కమిషనర్‌ ఆహ్మద్‌ నదీమ్, డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్‌ జనరల్‌ మధుసూదన్‌రెడ్డి, జిల్లా రిజిస్ట్రార్‌ వాసుదేవారావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాలె సుమలత, ఎంపీపీ గడ్డమీది స్వప్న రవీందర్‌గౌడ్, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ వెంకటయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ ననబోలు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు బూడిద స్వామి, కసావు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement