ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ నెల 29 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా ఏలూరు, తణుకులో 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 2,880 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వారికి అన్ని సెంటర్లలో మంచినీరు, ఇత
29 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
Sep 19 2016 9:34 PM | Updated on Sep 4 2017 2:08 PM
ఏలూరు సిటీ : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈ నెల 29 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా కోఆర్డినేషన్ కమిటీలో మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా ఏలూరు, తణుకులో 11 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో 2,880 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని వారికి అన్ని సెంటర్లలో మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
29న బిల్‌గ్రేడ్ ఫౌండేషన్ బృందం పర్యటన
జిల్లాలో ఆన్‌లైన్ ద్వారా అమలు చేసే పథకాలను బిల్‌గ్రేడ్ ఫౌండేషన్ వారు తణుకు, భీమడోలులో పర్యటించి పథకాల అమలుపై స్వయంగా అడిగి తెలుసుకుంటారని చెప్పారు. 29న ఏలూరు చేరుకుని రెండు బృందాలుగా తణుకు, భీమడోలు మండలాల్లో పర్యటిస్తారని చెప్పారు. ఎన్‌ఆర్‌జీఎస్ ద్వారా జరుగుతున్న పనులు, పింఛన్లు, ఎరువుల పంపిణీ, వైద్యం ఇతర అంశాలపై అడిగి తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు ఏలూరు కలెక్టరేట్ చేరుకుని జిల్లా అధికారుల సమావేశంలో బృందం పాల్గొంటారు
Advertisement
Advertisement