ఏలూరు అర్బన్ : దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఓ మహిళ గుళికలు తిని ఆత్మహత్యకు యత్నించింది
ఏలూరు అర్బన్ : దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన ఓ మహిళ గుళికలు తిని ఆత్మహత్యకు యత్నించింది. బాధితురాలి కథనం ప్రకారం.. కూటికుప్పల ఈశ్వరి చాలాకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బాధను తాళలేక ఇంటిలో ఉన్న గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన అత్త సత్యవతి, భర్త నాగరాజు ఆమెను చికిత్స కోసం ఏలూరులోని ప్రై వేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం రాత్రికి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.