వ్యాను బోల్తా: క్లీనర్‌ మృతి | One killed in accident | Sakshi
Sakshi News home page

వ్యాను బోల్తా: క్లీనర్‌ మృతి

Sep 28 2016 1:28 AM | Updated on Sep 4 2017 3:14 PM

వ్యాను బోల్తా: క్లీనర్‌ మృతి

వ్యాను బోల్తా: క్లీనర్‌ మృతి

కోవూరు: డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా వరికోత మిషన్‌తో వెళ్తున్న వ్యాను బోల్తా పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన రామన్నపాళెం గేటు వద్ద మలిదేవి వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకొంది.

కోవూరు: డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా వరికోత మిషన్‌తో వెళ్తున్న వ్యాను బోల్తా పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన రామన్నపాళెం గేటు వద్ద మలిదేవి వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. అల్లూరు మండలం నార్తుమోపూరుకు చెందిన నన్నూరు గోపాల్‌ (23) వరికోత మిషన్‌కు సహాయకుడిగా వెళ్తుతున్నాడు. ఈ క్రమంలో మిషన్‌ను తీసుకుని మోపూరు నుంచి లేగుంటపాడుకు వెళ్తున్నారు. మలిదేవి వంతెన సమీపంలో వ్యాను అదుపు తప్పడంతో గోపాల్‌ ఒక్కసారిగా బయటకు దూకేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు వరికోత మిషన్‌ పైన పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఏఎస్సై మురళీమోహన్‌ తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement