కోటి లక్షల టన్నుల ధాన్యం లక్ష్యం | one crore lacks tones of paddy target | Sakshi
Sakshi News home page

కోటి లక్షల టన్నుల ధాన్యం లక్ష్యం

Sep 14 2016 10:40 PM | Updated on Sep 4 2017 1:29 PM

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి జలాలలు తరలించి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

సిద్దిపేట జోన్‌: సిద్దిపేట జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి జలాలలు తరలించి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి లక్షల టన్నుల వరిధాన్యాన్ని పండించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

బుధవారం రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏసీ బాంక్వేట్‌ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ర్ట మంత్రి ఈటెల రాజేందర్‌తో మాట్లాడి రైస్‌ మిల్లర్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. సిద్దిపేటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, కరీంనగర్‌ రహదారిలో ఎస్పీ కార్యాలయంలో పరేడ్‌ గ్రౌండ్‌, మరో పైపు కలెక్టరేట్‌,  మరొక దిక్కు జెడ్పీ కార్యాలయం ఏర్పాటుచేస్తామన్నారు.

రెండు మూడు రోజుల్లో పత్తిపై సెస్‌ను 1.5 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి సాధ్యమవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందిచేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు. ప్రతి రోజు 2.5 టీఎంసీల నీటితో 25 వేల ఎకరాలకు నిత్యం నీరు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు.

సిద్దిపేట జిల్లాలో అంతగిరి, రంగనాయక్‌, మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మ ప్రాజెక్ట్‌ల ద్వారా వ్యవసాయానికి నీరు అందుతుందన్నారు. మెదక్‌ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు కూడా ఇదే ప్రాజెక్ట్‌తో నీటిని అందిస్తామన్నారు. మరో 2 లక్షల ఎకరాలను బెజ్జంకి పరిసర గ్రామాలకు సాగునీరు కోసం అందిస్తామని చెప్పారు. సిరిసిల్ల వద్ద  ఎగువ మానేరుకు 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు.

అన్నదాతకు సాగు నీరు అందినప్పుడే పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైస్‌ మిల్లర్ల సమస్యను పరిష్కరించేందుకు సబ్‌కమిటీ నియమిస్తామన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావును అసోసియేషన్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, రైస్‌ మిల్లర్స్‌ రాష్ర్ట అసోసియేషన్‌ కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోడుపునూరి చంద్రపాల్‌, పట్టణాధ్యక్షులు కొమరవెల్లి చంద్రశేఖర్‌తో పాటు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అక్తర్‌, టీఆర్‌ఎస్‌ రాష్ర్ట నాయకులు దేవేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement