వృద్ధుడు అనుమానాస్పద మృతి | old man suspicious death in gooty | Sakshi
Sakshi News home page

వృద్ధుడు అనుమానాస్పద మృతి

Feb 24 2017 9:34 PM | Updated on Sep 5 2017 4:30 AM

వృద్ధుడు అనుమానాస్పద మృతి

వృద్ధుడు అనుమానాస్పద మృతి

గుత్తి ఆర్‌ఎస్‌లోని సెయింట్‌ మేరీస్‌ ఇంగ్లిష్‌ మీడియం ఉన్నత పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు (60) అనుమానాస్పద స్థి«తిలో మృతి చెందాడు.

గుత్తి (గుంతకల్లు) : గుత్తి ఆర్‌ఎస్‌లోని సెయింట్‌ మేరీస్‌ ఇంగ్లిష్‌ మీడియం ఉన్నత పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు (60) అనుమానాస్పద స్థి«తిలో మృతి చెందాడు. తలపై బలమైన గాయాలు, రక్తస్రావమైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహం దుర్వాసన వస్తోంది. రెండు రోజుల కిందటే ఎవరో కొట్టి చంపేసినట్లు తెలుస్తోంది. హెడ్‌కానిస్టేబుల్‌ చెలమయ్య శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement