‘అనంత’లో కీచకుడు


అనంతపుర ం సెంట్రల్‌ : అనంతపురంలో ఓ కీచకుడు వావివరసలు మరిచాడు. సొంత కోడలినే లైంగికంగావేధించాడు. తనకు లొంగలేదనే కసితో గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అనంతపురం వన్‌ టౌన్‌ సీఐ రాఘవన్‌ కథనం మేరకు... నీరుగంటి వీధిలో ఉంటున్న ఆదినారాయణ అనే వ్యక్తి సొంత కోడలిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఆపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదినారాయణ కుమారుడు పుట్టుకతోనే అంధుడు.ఐదేళ్ల కిందట ఆయనకు ఓ మహిళతో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే అంధుడైన కుమారుడు ఇంట్లో లేని సమయంలో కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. గురువారం బలవంతం చేశాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో చంపుతానంటూ బెదిరించాడు. అంతటితో ఆగక గొంతునులిమేందుకు యత్నించాడు. అయితే ఆమె తప్పించుకుని జరిగిన ఘటనను భర్త, ఆమె బంధువులకు తెలిపారు. అనంతరం వన్‌టౌన్‌ సీఐకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచక మామ కోసం గాలిస్తున్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top