వారంలోగా ఓడీఎఫ్‌ గ్రామాల జాబితా ఇవ్వాలి | Odieph week to the list of villages | Sakshi
Sakshi News home page

వారంలోగా ఓడీఎఫ్‌ గ్రామాల జాబితా ఇవ్వాలి

Aug 26 2016 11:58 PM | Updated on Sep 4 2017 11:01 AM

మాట్లాడుతున్న జేసీ దివ్య

మాట్లాడుతున్న జేసీ దివ్య

బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల జాబితాను వారంలోగా అందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డి.దివ్య ఆదేశించారు.

  • వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ డి.దివ్య
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌ : బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల జాబితాను వారంలోగా అందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డి.దివ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులతో ఓడీఎఫ్‌ గ్రామాలు, హరితహారం, దీపం పథకంలో గ్యాస్‌ కనెక్షన్ల మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పొగ రహిత గ్రామాలుగా ప్రకటించిన పల్లెల వివరాలను సైతం అందించాలని పేర్కొన్నారు. దీపం పథకం ద్వారా మంజూరైన గ్యాస్‌ కనెక్షన్లను వారం రోజుల్లో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, జాబితాను నిర్ణీత సమయంలో అందించాలని ఆదేశించారు. దీపం పథకం మంజూరులో మణుగూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలు చాలా వెనుకబడి ఉన్నాయని, అధికారులు నిర్లక్ష్యం వీడి త్వరిత గతిన లబ్ధిదారులకు అందించేలా చూడాలని సూచించారు. కట్టెలపొయ్యితో అనేక మంది మహిళలు అనానోగ్యానికి గురవుతున్నారని, ప్రజలకు వంట చెరకు వాడకంతో కలిగే నష్టాలు, వ్యాధులపై ప్రజలకు అవగహన కల్పించాలన్నారు. వీసీలో జిల్లా పరిషత్‌ సీఈఓ మారుపాక నాగేశ్, డీపీఓ నారాయణరావు, డీఎస్‌ఓ ఉషారాణి, జిల్లా పరిషత్‌ ఏఓ భారతి, సూపరింటెండెంట్‌ వేణుమాధవ్, సులోచన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement