ఎన్టీపీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయడం లేదు | not partispation in ntpc recagnized elections | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయడం లేదు

Aug 24 2016 11:30 PM | Updated on Sep 4 2017 10:43 AM

ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్‌ కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి రామగుండం కార్పొరేషన్‌ కార్మిక విభాగం అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ ప్యారేమియా, కోమల్ల శ్రీనివాస్‌ తెలిపారు.

గోదావరిఖని : ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్‌ కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి రామగుండం కార్పొరేషన్‌ కార్మిక విభాగం అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ ప్యారేమియా, కోమల్ల శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం స్థానిక శివాజీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రూప్‌సింగ్‌ ఆదేశాల మేరకు ఎన్టీపీసీ ప్లాంట్‌లో జరిగే పర్మినెంట్‌ కార్మికుల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఎవరైనా టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం పక్షాన పోటీలో ఉంటే పార్టీకి గానీ, కార్మిక విభాగానికి ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు కేసీఆర్‌ ఫొటో గానీ, టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు, కండువాలు ఉపయోగించరాదని తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా పార్టీ పేరును వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు జనగామ శ్రీనివాస్, గడ్డం శంకర్, తొట్ల దేవేందర్, సందుపట్ల సత్యనారాయణరెడ్డి, ఎరచాటి ప్రవీణ్‌కుమార్, ఎ.కుమార్, కె.శ్రీనివాస్, టి.సుమన్‌ పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement