యాగంటి ఆలయ ఈవోపై హత్యాయత్నం


-పెట్రోల్‌ పోసిన జూనియర్ అసిస్టెట్

యాగంటి: కర్నూలు జిల్లా యాగంటి ఈవోపై హత్యాయత్నం జరిగింది. ఆలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డాడు. తనకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఆపారన్న అక్కసుతో కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం ఆలయ ఈవో ఆదిశేషనాయుడుపై పెట్రోల్ పోశాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఈవోపై పోసి నిప్పు అంటిస్తానని బెదిరించడంతో అక్కడున్న సిబ్బంది అతనిని అడ్డుకున్నారు. ఈ విషయమై ఆదిశేషనాయుడు యాగంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top