జిల్లా వ్యాప్తంగా 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులందరికీ మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేయించాలని జాయింట్ కలెక్టర్ రమామణి తెలిపారు.
అనంతపురం మెడికల్: జిల్లా వ్యాప్తంగా 9 నెలల నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులందరికీ మీజిల్స్, రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్ వేయించాలని జాయింట్ కలెక్టర్ రమామణి తెలిపారు. ఎంఆర్ క్యాంపెయిన్‌కు సంబంధించి లయన్స్ క్లబ్ అందజేసిన ప్రచార సామగ్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సెప్టెంబర్ 8వ తేదీ వరకు పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, ఇతరత్రా ప్రాంతాల్లో టీకాలు వేయనున్నట్లు చెప్పారు. వంద శాతం లక్ష్యం సాధించాలన్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలన్నారు.
ఆశకార్యకర్తలకు జూన్,జూలై ఇన్సెంటివ్‌ను త్వరగా విడుదల చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, డీఐఓ పురుషోత్తం, డీపీఎంఓ డాక్టర్ అనిల్‌కుమార్, పీఓడీటీ సుజాత, యునిసెఫ్, డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్స్ దిలీప్‌కుమార్, రితీశ్ బజాజ్, డెమో ఉమాపతి, డిప్యూటీ డెమో నాగరాజు, గంగాధర్, హెచ్‌ఈఓ సత్యనారాయణ, డీపీహెచ్‌ఎన్ రాణి, హెచ్‌ఈఈఓ లక్ష్మినరసమ్మ తదితరులు పాల్గొన్నారు.