బైక్‌లో దాచిన రూ.నాలుగున్నర లక్షలు మాయం | money theft from Bike dikki | Sakshi
Sakshi News home page

బైక్‌లో దాచిన రూ.నాలుగున్నర లక్షలు మాయం

Aug 18 2016 7:08 PM | Updated on Aug 24 2018 2:36 PM

బ్యాంకులో డబ్బులు డ్రా చేసి ఇంటికి వెళ్తున్న వ్యక్తి నుంచి చాకచక్యంగా డబ్బులు కాజేసిన సంఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది.

బ్యాంకులో డబ్బులు డ్రా చేసి ఇంటికి వెళ్తున్న వ్యక్తి నుంచి చాకచక్యంగా డబ్బులు కాజేసిన సంఘటన గుంటూరు నగరంలోని నల్లచెరువు 9వ లైన్ మెయిన్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. రూపేశ్ కాటన్ మిల్లులో పనిచేసే మురళి అనే వ్యక్తి గురువారం కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ.నాలుగున్నర లక్షలు డ్రా చేశాడు. ఇంటికి వెళ్లే దారిలో ఓ రేషన్ షాపు వద్ద బైక్‌ను ఆపి బియ్యం సంచి తీసుకెళ్దామని రేషన్ షాపులోకి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బైక్ బ్యాగులో ఉంచిన నగదు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement