ధ్వజస్తంభానికి మొక్కుకునే అవకాశమూ లేదా? | Mohan Babu fires on TTD | Sakshi
Sakshi News home page

సినీ నటుడు మోహన్‌ బాబు ఆవేదన

Jan 9 2017 11:32 AM | Updated on Sep 5 2017 12:45 AM

ధ్వజస్తంభానికి మొక్కుకునే అవకాశమూ లేదా?

ధ్వజస్తంభానికి మొక్కుకునే అవకాశమూ లేదా?

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధ్వజస్తంభానికి నమస్కరించుకునే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మోహన్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

టీటీడీపై మండిపడ్డ సినీ నటుడు మోహన్‌బాబు

సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధ్వజస్తంభానికి నమస్కరించుకునే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని సినీ నటుడు మోహన్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వైకుంఠ ఏకాదశి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలను టీటీడీ దెబ్బతీస్తుందన్నారు.

అతి ముఖ్యుల పేరుతో కొందరికి మాత్రమే ధ్వజస్తంభాన్ని తాకే అవకాశం ఇవ్వటం సరికాదని మండిపడ్డారు. ఏకాదశి రోజున ధ్వజస్తంభం చేతులతో సృశించి ఆథ్యాత్మిక అనుభూతిని పొందుతారని అలాంటి వాటిని దూరం చేయటం ధార్మిక సంస్థకు తగదన్నారు. టీటీడీలో ఒక్కోఅధికారి ఒక్కో నిబంధన అమలు చేయటం సరికాదని అన్నారు. టీటీడీ డబ్బున్నవాళ్లకి దగ్గరవుతూ, సామాన్యులకు దూరమవుతోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు తిరుమలలో సరికావన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement