భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య | man suiside | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

Aug 11 2016 2:15 AM | Updated on Nov 6 2018 8:28 PM

కళ్యాణదుర్గం రూరల్‌ : భార్య కాపురానికి రాలేదని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని అక్కమ్మ కొండ సమీపంలో బుధవారం జరిగింది.

కళ్యాణదుర్గం రూరల్‌ : భార్య కాపురానికి రాలేదని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని అక్కమ్మ కొండ సమీపంలో బుధవారం జరిగింది. బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ గ్రామానికి చెందిన బోయ ధనుంజయ్య (28) రెండేళ్ల క్రితం శెట్టూరు మండలం చిన్నంపల్లిలో వివాహం చేసుకున్నాడు. ఇతడు భార్యతో తరుచూ గొడవ పడేవాడు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లి పోయింది. కాపురానికి రావాలని పలుమార్లు సూచించినా భార్య రాకపోవడంతో మనస్థాపానికి గురై పట్టణంలోని అక్కమ్మ కొండ సమీపంలో బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement