ఎల్వీయార్‌ క్లబ్‌ క్రీడాకారుల ప్రతిభ | Sakshi
Sakshi News home page

ఎల్వీయార్‌ క్లబ్‌ క్రీడాకారుల ప్రతిభ

Published Tue, Oct 18 2016 11:06 PM

ఎల్వీయార్‌ క్లబ్‌ క్రీడాకారుల ప్రతిభ

గుంటూరు స్పోర్ట్స్‌:  కాకినాడలో ఈనెల 9వ తేదీ నుంచి 17 వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ర్యాంకింగ్‌ బిలియర్డ్స్, స్నూకర్‌ టోర్నమెంట్‌లో ఎల్‌వీఆర్‌ క్లబ్‌కు చెందిన క్రీడాకారులు ఎస్‌.శంకరరావు బిలియర్డ్స్‌ విభాగంలో, ఎస్‌.రమాకాంత్‌ స్నూకర్‌ విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సా«ధించారు.  మంగళవారం  కొరిటెపాడులోని ఎల్‌వీఆర్‌ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో వీరిని ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో క్లబ్‌ పాలక వర్గ సభ్యులు పులివర్తి వెంకటేశ్వరరావు(అజార్‌), మాదాల వెంకటేశ్వర్లు, క్లబ్‌ సభ్యులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement