పురవీధుల్లో ఊరేగుతున్న ఉత్సవ మూర్తులు
స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఉదయం ఏకదంతుడు కాణిపాకం పుర వీధుల్లో విహరించారు.
కాణిపాకం(ఐరాల)
స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఉదయం ఏకదంతుడు కాణిపాకం పుర వీధుల్లో విహరించారు. భక్తులు స్వామి వారికి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన ఆర్యవైశ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూల విగ్రహానికి సంప్రదాయ బద్ధంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం దూపదీప నైవేద్యాలను సమర్పించిన తరువాత భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేతుడైన వరసిద్దుడిని సర్వాకృతులను చేసి ,ఆలయ అలంకార మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మెక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పూర్ణచంద్రారావు,పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.