కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి | Learn to look at KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి

Nov 2 2015 8:10 PM | Updated on Aug 14 2018 10:54 AM

కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి - Sakshi

కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి

వరంగల్ ఉప ఎన్నికలో పసునూరి దయాకర్‌కు టిక్కెట్, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త

♦ పేద దళితుడికి టిక్కెట్, నిధులు ఇచ్చారు
♦ ఉప ముఖ్యమంత్రి కడియం
 
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఉప ఎన్నికలో పసునూరి దయాకర్‌కు టిక్కెట్, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అంకానికి తెర తీశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పేద దళితుడికి టిక్కెట్, ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చిన కేసీఆర్‌కు వరంగల్ ప్రజల తరపున, టీఆర్‌ఎస్ జిల్లా శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల్లోని పేద అభ్యర్థులు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి నిర్ణయాలు ఎంతో దోహదం చేస్తాయని, ఈ విషయంలో అన్ని రాజకీయపార్టీలు కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. 

పసునూరి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గత్యంతరం లేక ఒకరికి అవకాశం ఇవ్వగా.. బీజేపీకి అభ్యర్థే దొరకడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి, వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీలు బి.వినోద్‌కుమార్, ఎ.సీతారాంనాయక్,  ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్ పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement