విధులు బహిష్కరించిన న్యాయవాదులు | lawyers bycot thair duties | Sakshi
Sakshi News home page

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

Sep 6 2016 11:56 PM | Updated on Sep 4 2017 12:26 PM

కమాన్‌చౌరస్తా : హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలని కోరుతూ హుస్నాబాద్‌లో దీక్ష చేపట్టిన న్యాయవాదులపై శుక్రవారం పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ జిల్లా కోర్టు న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు.

కమాన్‌చౌరస్తా :  హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్‌లోనే కొనసాగించాలని కోరుతూ హుస్నాబాద్‌లో దీక్ష చేపట్టిన న్యాయవాదులపై శుక్రవారం పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ జిల్లా కోర్టు న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. జిల్లా కోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి కోర్టు వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించి నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మండలాలను సిద్దిపేటలో విలీనం చేయరాదని న్యాయవాదులను డిమాండ్‌ చేస్తూ పోలీసుల వైఖరిపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు ప్రభాకర్‌రావు, ఎం విక్రంరెడ్డి, రాజ్‌కుమార్‌ గుప్తా, భీమాసాహెబ్, హుస్నాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుబ్బాక నాగరాజు, కార్యదర్శి బాకం సంపత్, సీనియర్‌ న్యాయవాదులు శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డి,ç Üంజీవరెడ్డి, మల్లేశం, రవీందర్,  దేవేందర్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement