ఎంఈఓ మల్లికార్జున, తహసీల్దార్ సుబ్రమణ్యంలు తనను, తన భర్తను కులం పేరుతో దూషించి, అవమానించారని గొంచిరెడ్డిపల్లికి చెందిన పిల్లలపల్లికి చెందిన నాగమ్మ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బ్రహ్మసముద్రం : ఎంఈఓ మల్లికార్జున, తహసీల్దార్ సుబ్రమణ్యంలు తనను, తన భర్తను కులం పేరుతో దూషించి, అవమానించారని గొంచిరెడ్డిపల్లికి చెందిన పిల్లలపల్లికి చెందిన నాగమ్మ శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొంచిరెడ్డిపల్లిలోని ఎంఈఓ పొలంలో కూలి పనులకు వెళ్లిన తమను పనులు సక్రమంగా పనిచేయలేదని ఎంఈఓతోపాటు అదే సమయానికి అక్కడకు వచ్చిన తహసీల్దార్ కూడా కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు.