తహసీల్దార్‌ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి సవిత | Minister Savitha Throws Bouquet Video Goes On Viral | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ సమక్షంలో.. తహసీల్దార్‌ ఇచ్చిన బొకేను విసిరేసిన మంత్రి సవిత

Jun 7 2025 5:51 PM | Updated on Jun 7 2025 7:36 PM

Minister Savitha Throws Bouquet Video Goes On Viral

శ్రీసత్యసాయి జిల్లా, సాక్షి: శ్రీ సత్యసాయి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మంత్రి సవిత దురుసు ప్రవర్తన హాట్‌ టాపిగ్గా మారింది. పెనుకొండ తహసీల్దార్‌ శ్రీధర్‌  ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరేశారు. ఈ ఘటన  జిల్లా కలెక్టర్‌ చేతన్‌ సమక్షంలో ఘటన చోటు చేసుకుంది. 

 అయితే, మంత్రి సవిత తీరుపట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సవిత బొకేని విసిరేసిన దృశ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బొకే ఇస్తే తీసుకోవాలి. లేదంటే పక్కకు పెట్టాలి. లేదంటే తనతోపాటు ఉన్నవారికి ఇవ్వాలి. అంతే గాని ఇలా విసిరేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇలా మంత్రి సవిత దురుసు ప్రవర్తన  కొత్తేమీ కాదు. గతేడాది నవంబర్‌లో జరిగిన శాసన మండలిలో సవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గతంలో టీబీటీ(Direct Benefit Transfer)నిధుల ద్వారా వచ్చిన సొమ్ముతో..  రాష్ట్రంలో మహిళలు గంజాయికి  అలవాటు పడ్డారని అన్నారామె.

Viral Video: బొకేను విసిరేసిన మంత్రి సవిత

జగన్‌మోహన్‌రెడ్డి టీబీటీ పథకాల వల్ల రాష్ట్రంలో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అంటూ మంత్రి సవిత ప్రసంగించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించ పరిచేలా మంత్రి సవిత మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు. 

మరోవైపు..మంత్రి సవిత వ్యాఖ్యలు పై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శాంతించక పోవడంతో మండలిని వాయిదా వేశారాయన.

Advertisement
 
Advertisement
Advertisement