ఆలయం ముందు షామియానాలు, క్యూల ఏర్పాటు
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం పాలకొండ కోటదుర్గమ్మ భక్తులకు శనివారం నిజరూపంలో దర్శిన మివ్వనున్నారు. ఈ ఏడాదిలో శనివారం ఒక్కరోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు కనిపించే అమ్మవారి దర్శనం కోసం లక్ష మంది భక్తులు వస్తారని అంచనా.
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం పాలకొండ కోటదుర్గమ్మ భక్తులకు శనివారం నిజరూపంలో దర్శిన మివ్వనున్నారు. ఈ ఏడాదిలో శనివారం ఒక్కరోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు కనిపించే అమ్మవారి దర్శనం కోసం లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు, క్యూలు, షామియానాలు వేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా పాలక వర్గం బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా 12 రోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని ఆలయ కమిటీ చైర్మన్ దుప్పాడ పాపినాయుడు తెలిపారు.