
వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టనున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు.
నల్లబెల్లి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య పథకానికి శ్రీకారం చుట్టనున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలోని అన్ని గురుకుల పాఠశాలలను కేజీ నుంచి పీజీకి సరిపోయేలా వసతులు కల్పిస్తూ తీర్చిదిద్దేందుకు అందుకు అవసరమైన మార్గాదర్శకాలు సీఎం కేసీఆర్‌కు అందించినట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి నియోజక వర్గంలో 10 గురుకులాలు ఏర్పాటు చేస్తామని కడియం శ్రీహరి ఈ సందర్భంగా ప్రకటించారు.