ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ కీలకపాత్ర పోషించాలని ఆ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి పిలుపునిచ్చారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ కీలకపాత్ర పోషించాలని ఆ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదులో వైఎస్సార్ టీఎఫ్ ముందుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించిన ఆయన ఏకీకత సర్వీస్ రూల్స్‌ను తెచ్చి ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు రావాల్సిన రెండు డీఏలను వెంటనే అందించాలన్నారు. పదవ పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో జమ చేయాలన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయానికి కషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడు వెంకటేశులు, జిల్లా నాయకులు భాస్కర్‌రెడ్డి, సురేశ్, రమేశ్, అల్తాఫ్, కోశాధికారి ఫల్గుణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.