ఫాంహౌస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి | kcr reaches his farmhouse | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి

May 7 2016 7:21 PM | Updated on Jul 11 2019 7:45 PM

సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.

మెదక్ : సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గాన మెదక్ జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ముందుగానే సమాచారం ఉండడంతో జిల్లా ఎస్పీ సుమతి ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రం, రోడ్డు మార్గాన భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఫాంహౌస్‌కు సీఎం రాగానే ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులపై ఆరా తీసినట్లు సమాచారం. సోమవారం కూడా సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం. ఆదివారం,  సోమవారాల్లో కేసీఆర్ ఎర్రవల్లిలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement