పోలీసుల అదుపులో మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి | Karmingar police to take under control Former ASI mohan reddy | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి

Aug 23 2016 9:25 AM | Updated on Oct 16 2018 9:08 PM

మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ తరహాలోనే మోహన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టార్‌ నయీం ముఠాతో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. నిన్న రాత్రి (సోమవారం) 8 గంటలకు మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం గత 10 రోజులుగా మోహన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు.

కాగా, నరహంతకుడు నయీం ముఠాతో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డికి సంబంధాలున్నాయని మోహన్‌రెడ్డి బాధితుల సంఘం ఆరోపించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement