కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థులకు కళాఉత్సవ్ నిర్వíß ంచనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
విద్యార్థులకు కళా ఉత్సవ్
Sep 2 2016 12:44 AM | Updated on Sep 4 2017 11:52 AM
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యార్థులకు కళాఉత్సవ్ నిర్వíß ంచనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని సజనాత్మకతను వెలికితీసేందుకుగాను ఈనెల 7న డివిజన్‌స్థాయిలో, 9న జిల్లాస్థాయిలో కార్యక్రమాలు చేపడతామన్నారు. మ్యూజిక్ విభాగంలో ఆరు నుంచి పది మంది విద్యార్థులు, డ్యాన్సులో ఎనిమిది నుంచి పది మంది విద్యార్థులు పాల్గొనాల్సి ఉంటుందన్నారు.
థియేటర్ విభాగంలో ఎనిమిది నుంచి 12మంది, విజువల్ ఆర్ట్స్‌లో నలుగురి నుంచి ఆరుగురు మాత్రమే పాల్గొనాలన్నారు. ఇందుకు 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు అర్హులన్నారు. జిల్లాస్థాయిలో మొదటిస్థానం నిలిచిన బందానికి రూ.ఐదు వేలు, రెండో బహుమతి కింద రూ.మూడు వేలు, మూడో బహుమతి కింద రూ.రెండువేలు అందజేస్తామన్నారు.
జిల్లాస్థాయిలో ఎంపికైన విద్యార్థులను ఈనెల 27, 28వ తేదీల్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ ప్రతిభ చూపిన విద్యార్థులు జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశముందన్నారు. ఈ సమావేశంలో డీఈఓ విజయలక్ష్మీబాయి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, డీపీఆర్‌ఓ యు.వెంకటేశ్వర్లు, డీవీఈఓ హనుమంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement