హోరాహోరీగా చెడుగుడు పోటీలు | kabbaddi games are in tough fight | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా చెడుగుడు పోటీలు

Sep 3 2016 11:06 PM | Updated on Sep 4 2017 12:09 PM

హోరాహోరీగా చెడుగుడు పోటీలు

హోరాహోరీగా చెడుగుడు పోటీలు

నరసాపురం రూరల్‌ : రెండు రోజులుగా సరిపల్లిలో నిర్వహిస్తున్న చెడుగుడు పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి.

నరసాపురం రూరల్‌ : రెండు రోజులుగా సరిపల్లిలో నిర్వహిస్తున్న చెడుగుడు పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. గునుపూడి–ఊనగట్ల జట్ల మధ్య జరిగిన పోటీలో గునుపూడి జట్టు, సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్‌(తుందుర్రు)– పాలకొల్లు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తుందుర్రు టీమ్, భీమవరం– అభి ఫ్రెండ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భీమవరం జట్లు విజయం సాధించి రెండోరౌండ్‌కు ఎంపికయ్యాయి. ఆదివారం సాయంత్రానికి ఆరు టీమ్‌లు లీగ్‌ దశలోకి వెళతాయని రిఫరీ మహేష్‌నాయుడు తెలిపారు. ఈ పోటీలలో వివిధ ప్రాంతాలకు చెందిన 16 జట్లు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు చెప్పారు. చికిలే డేవిడ్, చికిలే జీవన్‌కిశోర్, పాలపర్తి శాంతిరాజు, మైలాబత్తుల విజయ్‌ప్రసాద్‌ తదితరుల ఆ«ర్థిక సహాయంతో పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మైలాబత్తుల చక్రవర్తి, చిన్నం వెంకట్‌ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో నల్లి అశోక్, బట్టు నాగేశ్వరరావు, చెల్లం రత్నంరాజు, ఈదా ఆనంద్, సిర్రా చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement