టీఎంఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్‌ | jagadishwar elected as a TMOA state general secretary | Sakshi
Sakshi News home page

టీఎంఓఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్‌

Oct 6 2016 6:13 PM | Updated on Nov 9 2018 5:52 PM

తెలంగాణ మీసేవ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఓఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ములుగుకు చెందిన దాస జగదీశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గజ్వేల్‌ రూరల్‌: తెలంగాణ మీసేవ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఓఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ములుగుకు చెందిన దాస జగదీశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లోని జిల్లెలగూడ స్వాగత్‌ గ్రాండ్‌ హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర మీసేవ ఆపరేటర్ల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అధ్యక్షునిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన జీవన్‌ ప్రసాద్‌ను ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా జగదీశ్వర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆనంద్‌కుమార్‌ (సిద్దిపేట), సంయుక్త కార్యదర్శిగా కరుణాకర్‌గౌడ్‌ (వర్గల్‌)తో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా గురువారం జగదీశ్వర్‌ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మీసేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి  పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఆపరేటర్లందరిని సంఘటితపరుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement