సిమెంటు ధర పైపైకి..! | increase Cement prices 40 Rupees | Sakshi
Sakshi News home page

సిమెంటు ధర పైపైకి..!

Jun 18 2016 8:06 AM | Updated on Sep 4 2017 2:44 AM

సిమెంటు ధర పైపైకి..!

సిమెంటు ధర పైపైకి..!

కొద్ది నెలల క్రితం వరకూ గృహ నిర్మాణదారులను ఇసుక ధరలు భయపెట్టారుు. ఇప్పుడు సిమెంట్ ధరలు...

నాలుగు రోజుల్లో బస్తాకు రూ. 40 పెరుగుదల
నరసన్నపేట: కొద్ది నెలల క్రితం వరకూ గృహ నిర్మాణదారులను ఇసుక ధరలు భయపెట్టారుు. ఇప్పుడు సిమెంట్ ధరలు బెంబేలెత్తిస్తున్నారుు. ఇసుక ధర  ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. చాలామంది గృహ నిర్మాణాలకు పూనుకున్నారు. అయితే ఇదే అవకాశంగా చేసుకొని సిమెంట్ వ్యాపారులు ధరలను అమాంతంగా పెంచేశారు.

నెల రోజుల క్రితం బస్తా సిమెంట్ 260 రూపాయలకు లభించేది. వారం రోజుల క్రితం రూ. 320 అయింది. ప్రస్తుతం 370 రూపాయలకు చేరింది. దీంతో గృహ నిర్మాణదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని కంపెనీలు సిండికేట్ అయి.. ఒక్కసారిగా ధరలు పెంచాయి. మహాగోల్డు సిమెంట్ రిటేల్‌గా రూ. 380 పలుకుతోంది.

ఇతర కంపెనీల ధరల్లో రూ. 5 నుంచి పది రూపాయల వరకూ తేడా ఉంది. నెల రోజల క్రితం బస్తా రూ. 260 ఉండగా..ఇప్పుడు రూ. 370 కావడం ఏమిటని నిర్మాణదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలు గృహనిర్మాణ దారులపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపుతున్నాయి. ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement