జిల్లాలో వర్షాభావంతో ఎండుతున్న 90 వేల ఎకరాల్లోని వేరుశనగ పంటకు రక్షక నీటి తడులను అందించామని ఇన్‌చార్జి కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు.
అనంతపురం అర్బన్: జిల్లాలో వర్షాభావంతో ఎండుతున్న 90 వేల ఎకరాల్లోని వేరుశనగ పంటకు రక్షక నీటి తడులను అందించామని ఇన్‌చార్జి కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 1,33,598 ఎకరాల్లో వేరుశనగ బెట్ట పరిస్థతుల్లో ఉందని తెలిపారు. రైతుల బోర్ల నుంచి పక్కనున్న 72,981 ఎకరాలకు, కెనాల్ ద్వారా నీటిని సేకరించి 8,352 ఎకరాలకు రెయిన్‌గన్‌ల ద్వారా తడులు ఇచ్చామని వివరించారు.