మహిళా గ్రూపు సభ్యుల డబ్బు హాంఫట్ | IKP coordinator two lakhs draw with out permition woman's group money | Sakshi
Sakshi News home page

మహిళా గ్రూపు సభ్యుల డబ్బు హాంఫట్

Mar 31 2016 4:00 AM | Updated on Sep 3 2017 8:53 PM

మహిళా గ్రూపు సభ్యుల డబ్బు హాంఫట్

మహిళా గ్రూపు సభ్యుల డబ్బు హాంఫట్

మహిళా గ్రూప్ సభ్యులకు తెలియకుండా అధికారులతో కుమ్మక్కైన ఐకేపీ కోఆర్డినేటర్ రూ. 2.10 లక్షలు డ్రా చేసిన సంఘటన రెండేళ్ల తరువాత వెలుగులోకి వచ్చింది.

సభ్యులకు తెలియకుండా డ్రా
అధికారులు, సీఏల కుమ్మక్కు
రెండేళ్ల తరువాత వెలుగులోకి..

 మెదక్: మహిళా గ్రూప్ సభ్యులకు తెలియకుండా అధికారులతో కుమ్మక్కైన ఐకేపీ కోఆర్డినేటర్ రూ. 2.10 లక్షలు డ్రా చేసిన సంఘటన రెండేళ్ల తరువాత వెలుగులోకి వచ్చింది. ఇం దుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండలం శమ్నాపూర్ తండాలో సుమారు వందకు పైగా ఇళ్లు ఉన్నాయి. ఈ తండాలో స్వ యం సహాయక గ్రూపులను నడిపిం చేందుకు కోఆర్డినేటర్ ను నియమిం చారు. అయితే సదరు కోఆర్డినేటర్ మహిళా గ్రూప్ సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారికి తెలి యకుండానే అధికారులతో కుమ్మక్కై  మూడు గ్రూప్‌లకు చెందిన రూ. 2.10 లక్షలు డ్రా చేసుకున్నాడు.

బ్యాంకులో చెల్లించడం లేదు. దీంతో సంబంధిత గ్రూ పు సభ్యులకు బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడం లేదు. మాకు ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని మహిళలు బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా అసలు విష యం బయట పడింది. 2014లో మూడు గ్రూపుల సభ్యుల రూ. 2.10 లక్షలు స్త్రీ నిధి రుణాలు పొందారని, వాటిని వడ్డీతో సహ చెల్లిస్తేనే కొత్త రుణాలి స్తామని బ్యాంకు అధికారులు తెల్చి చెప్పడంతో అమాయక మహిళలంతా తెల్ల మొహం వేశారు.

ఈ విషయంపై లబోదిబోమంటూ ఐకేపీ అధికారులకు మొరపెట్టుకున్నారు. శమ్నాపూర్ తండాలో సీఏ పనిచేసిన వ్యక్తి గతంలో ఈ రుణం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో విషయాన్ని ఎవరికి చెప్పొద్దని, త్వరలోనే సీఏ నుంచి డబ్బులు వసూలు చేయిస్తామని ఐకేపీ అధికారులు మహిళా సంఘాల సభ్యులను బుజ్జగించే పనిలో పడ్డ ట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బులు డ్రా చేసిన సీఏ ను పిలిపించి లోలోపల చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

 అధికారి వివరణ: ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం ఇందిరను సాక్షి వివరణ కోరగా తాను ఇక్కడకు రాకముందే ఈ వ్యవహారం జరిగిందన్నారు. కాగా మహిళా గ్రూప్ సభ్యులకు తెలియకుండా శ్రీనిధి రుణాలు తీసుకున్న సీఏతో మాట్లాడుతున్నామని, త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement