సర్వేపై నమ్మకం ఉంటే వెంటనే ఎన్నికలు జరపండి

సర్వేపై నమ్మకం ఉంటే వెంటనే ఎన్నికలు జరపండి - Sakshi


పార్టీ మారిన అసెంబ్లీ స్థానాల్లోనైనాఎన్నికలకు రండి

వైఎస్సార్ సిపి నాయకులు చిన్నశ్రీను, బెల్లాన సవాల్


చీపురుపల్లి: చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాలకే సర్వేలు చేయించుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు అదే సర్వేపై నమ్మకం ఉంటే తక్షణం ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ సవాల్ విసిరారు. సోమవారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రభుత్వం పని తీరుపై ఆయన సొంత పత్రికలో సోమవారం వెలువడిన సర్వేపై స్పందించారు. రెండున్నర సంవత్సరాలకే ప్రభుత్వం సర్వేలు నిర్వహించుకోవడం ఎక్కడా చూడలేదన్నారు. చంద్రబాబునాయుడు చేరుుంచుకున్న సర్వేలు కావడంతో ఆయనకు దానిపై నమ్మకం ఉంటే ఎన్నికలు నిర్వహించాలనీ... ఇదే విషయాన్ని తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటి నుంచో కోరుతున్నారని గుర్తు చేశారు.కనీసం రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ జెండాపై గెలుపొంది, ఇటీవల తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న ఎంఎల్‌ఏల స్థానాల్లో వారితో రాజీనామా చేరుుంచి ఎన్నికలు నిర్వహిస్తే వాస్తవాలు తేలుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యమైపోతున్న తెలుగుదేశం క్యాడర్‌లో ధైర్యం నింపేందుకు అభూత కల్పనలు సృష్టించి ఇలాంటి సర్వేలను పత్రికల్లో ప్రచురించడం బాధాకరమని అన్నారు. నోట్లు రద్దుతో ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో ఆ బాధలు పట్టించుకోకుండా పార్టీ కాపాడుకునే ప్రకటనల పనిలో ముఖ్యమంత్రి ఉండడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, కరిమజ్జి శ్రీనివాసరావు, ఇప్పిలి తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top