‘చుట్టాలబ్బాయి’ సందడి | Hero Aadi in Nellore | Sakshi
Sakshi News home page

‘చుట్టాలబ్బాయి’ సందడి

Aug 26 2016 1:08 AM | Updated on Sep 4 2017 10:52 AM

‘చుట్టాలబ్బాయి’ సందడి

‘చుట్టాలబ్బాయి’ సందడి

నెల్లూరు, సిటీ : నగరంలో చుట్టాలబ్బాయి చిత్ర బృందం గురువారం సందడి చేసింది. చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా హీరో ఆది, డైరెక్టర్‌ వీరభద్ర నర్తకి థియేటర్‌లో హంగామా చేశారు.

 
   నెల్లూరు, సిటీ : నగరంలో చుట్టాలబ్బాయి చిత్ర బృందం గురువారం సందడి చేసింది. చిత్రం విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా హీరో ఆది, డైరెక్టర్‌ వీరభద్ర నర్తకి థియేటర్‌లో హంగామా చేశారు. అభిమానుల అరుపులు, కోలాహాలం మధ్యన కొంతసేపు ప్రేక్షకులతో మాట్లాడారు. హీరో ఆది అభిమానులు కోరిక మేరకు చిత్రంలోని ఓ డ్యాన్స్‌ స్టెప్‌ వేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో డైరెక్టర్‌ వీరభద్ర మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో ఓ భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. హీరో ఆది మాట్లాడుతూ నా తొలి చిత్రం ప్రేమకావాలి నర్తకీ «థియేటర్‌లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపారు. విజయోత్సవ యాత్రలో భాగంగా అప్పట్లో ఇదే నర్తకీ థియేటర్‌కు వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. నా విజయయాత్ర ఇక్కడి నుంచే మొదలైందన్నారు. నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమా చుట్టాలబ్బాయి విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రానున్న రోజుల్లో మంచి చిత్రాల్లో నటిస్తానన్నారు. ప్రస్తుతం ఏ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి, నర్తకీ థియేటర్‌ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement