టీడీపీ హయాంలోనే దళితులపై దాడులు | herasment in tdp government | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలోనే దళితులపై దాడులు

Oct 31 2016 11:32 PM | Updated on Aug 10 2018 8:23 PM

టీడీపీ హయాంలోనే దళితులపై దాడులు - Sakshi

టీడీపీ హయాంలోనే దళితులపై దాడులు

పొన్నూరు : తెలుగుదేశం పార్టీ హయాంలోనే దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే డాక్టర్‌ టి.రాజారావుపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు.

 
పొన్నూరు : తెలుగుదేశం పార్టీ హయాంలోనే దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే డాక్టర్‌ టి.రాజారావుపై అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. స్థానిక ప్రజా వైద్యశాలలో ఆదివారం రాజారావును కలిసి అక్రమ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితులంటే టీడీపీకి చులకనని, గతంలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజారావుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. డాక్టర్‌ టి.రాజారావుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని ఆయన తెలిపారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్య, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి డక్కుమళ్ళ రవి తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement