జిల్లాలోని విలీన మండలమైన వీఆర్‌పురంలోని రేఖవానిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో వింతవ్యాధి బారినపడిన పదకొండు మందిని ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్య ఆరోగ్యశాఖాధికారులు గురువారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు.
వింత వ్యాధి బాధితులకు జీజీహెచ్‌లో చికిత్స
Sep 8 2016 10:22 PM | Updated on Sep 4 2017 12:41 PM
కాకినాడ సిటీ :
జిల్లాలోని విలీన మండలమైన వీఆర్‌పురంలోని రేఖవానిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో వింతవ్యాధి బారినపడిన పదకొండు మందిని ప్రత్యేక అంబులెన్స్‌లో వైద్య ఆరోగ్యశాఖాధికారులు గురువారం సాయంత్రం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. వారిని అత్యవసర విభాగం లో చేర్చి స్కానింగ్, ఎక్స్‌రే, ఈసీజీ, రక్తపరీక్షలు చేశారు. అనంతరం మెడికల్ విభాగంలో కేటాయించిన ప్రత్యేకవార్డులో వారి కి వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కె.చంద్రయ్య వింతవ్యాధి బాధితులను పరిశీలించి వారికి అం దించాల్సిన వైద్యసేవలపై ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ మూర్తితో చర్చించారు. అలాగే మరో 10 మంది బాధితులను రాత్రికి జీజీహెచ్‌కు తీసుకువస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.
Advertisement
Advertisement