కాణిపాకం భక్తుల రద్దీ | heavy rush in kanipakam temple | Sakshi
Sakshi News home page

కాణిపాకం భక్తుల రద్దీ

Sep 11 2016 12:31 AM | Updated on Sep 4 2017 12:58 PM

కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ

కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ అధికమైంది. స్వామివారి దర్శనానికి భక్తులకు రెండు గంటల సమయం పట్టింది.

 
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ అధికమైంది. స్వామివారి దర్శనానికి భక్తులకు రెండు గంటల సమయం పట్టింది. బ్రహ్మోత్సవ వేడుకల్లో ఐదవ రోజు రాత్రి వృషభ వాహనసేవలో  స్వామి వారిని దర్శించుకునేందుకు తమిళనాడు,కర్ణాటక రాష్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులందరికీ శీఘ్రదర్శనం కల్పించడం కోసం ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  వంద,యాభై,పదిరూపాయల టికెట్‌ల క్యూలన్నీ భక్తుల రద్దీతో నిండాయి.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement