ప్రధానిచే హెల్త్‌ వర్సిటీ భవనానికి శంకుస్థాపన | Health University laid the foundation of the building with prime minister | Sakshi
Sakshi News home page

ప్రధానిచే హెల్త్‌ వర్సిటీ భవనానికి శంకుస్థాపన

Aug 7 2016 12:22 AM | Updated on Aug 24 2018 2:20 PM

దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులతో రూ.130 కోట్లు వెచ్చిం చి ఓరుగల్లులోని కేంద్ర కారాగారం ప్రాÆ తంలో చేపట్టబోయే కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ భవన నిర్మాణానికి ఆది వారం మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు యూనివర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.

  • కేఎన్‌ఆర్‌ యూనివర్సిటీ కార్యకలాపాల్లో పురోగతి
  • హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ కరుణాకర్‌రెడ్డి
  • ఎంజీఎం : దేశంలో ఎక్కడా లేని విధంగా అ త్యాధునిక హంగులతో రూ.130 కోట్లు వెచ్చిం చి ఓరుగల్లులోని కేంద్ర కారాగారం ప్రాÆ తంలో చేపట్టబోయే కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ భవన నిర్మాణానికి ఆది వారం మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు యూనివర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. శని వారం కేఎంసీ ప్రాంగణంలోని యూనివర్సిటీ తాత్కాలిక భవనంలో రిజిస్ట్రార్‌ టి.వెంకటేశ్వర్‌రావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
     
    ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ చొరవతో.. కేంద్ర కారాగారం ప్రాంతంలో హెల్త్‌ యూనివర్సిటీతో పాటు ఎంజీఎం ట్విన్‌ టవర్స్‌ను ని ర్మించే విషయమై వేగంగా పురోగతిని సాధిస్తున్నామని తెలిపారు. సెంట్రల్‌ జైలుకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో లక్ష చదరపు అ డుగులతో రూ.45 కోట్లతో మొదట పరిపాలన భవనాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. నా రాయణరావు యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లోని అడ్మిషన్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా 2016–17 బ్యాచ్‌ పీజీ సీట్ల అడ్మిషన్లను ఏప్రిల్‌ మాసంలో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. 
     
    కౌన్సెలింగ్‌ ఆలస్యమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
    ఎంసీఐ నిబంధనల ప్రకారం ఈ నెల 31వ తేదీలోగా ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, అయితే ఎంసెట్‌–3 నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ అలస్యం కానుందని వరంగల్‌లోని కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ కరుణాకర్‌రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష కూడా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు సమయంపై ఎంసీఐ  వెసులుబాటు ఇస్తుందని తాము భావిస్తున్నామన్నారు. సెప్టెంబర్‌ 30 లోగా రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ మొదటి దశ కౌన్సిలింగ్‌ ప్రక్రియ దాదాపుగా పూర్తి అవుతుందని, రెండవ, మూడో దశల కౌన్సెలింగ్‌ ఆలస్యం కానున్న నేపథ్యంలో అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కోర్టు అనుమతి తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement