2008, 2012 డీఎస్సీల్లో మిగిలిపోయిన వికలాంగ అభ్యర్థుల బ్యాక్‌లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
అనంతపురం ఎడ్యుకేషన్: 2008, 2012 డీఎస్సీల్లో మిగిలిపోయిన వికలాంగ అభ్యర్థుల బ్యాక్‌లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. 2014 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులతో ఈ పోస్టులు భర్తీ చేశారు. మొత్తం 18 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారు. వీటిలో ఎస్జీటీ తెలుగు 11, ఎల్‌పీటీ 4, ఎల్‌పీహెచ్ 2, ఎల్‌పీ ఉర్దూ ఒకపోస్టు ఉన్నాయి.