హ్యండ్‌ బాల్‌ జిల్లా జట్టు ఎంపిక | Handball,districtteam,sececte | Sakshi
Sakshi News home page

హ్యండ్‌ బాల్‌ జిల్లా జట్టు ఎంపిక

Aug 6 2016 12:29 AM | Updated on Sep 4 2017 7:59 AM

హ్యండ్‌ బాల్‌ జిల్లా జట్టు ఎంపిక

హ్యండ్‌ బాల్‌ జిల్లా జట్టు ఎంపిక

పట్టణంలోని ఇండియా మిషన్‌ హైస్కూల్‌ల్లో హ్యండ్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలికల జట్లు ఎంపిక పోటీలను శుక్రవారం గెజిటేడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి జి. వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.

టౌన్‌:  పట్టణంలోని ఇండియా మిషన్‌ హైస్కూల్‌ల్లో  హ్యండ్‌ బాల్‌ సబ్‌ జూనియర్‌ బాలికల జట్లు ఎంపిక పోటీలను శుక్రవారం  గెజిటేడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి జి. వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ఎంపిక పోటిల్లో జిల్లా నుంచి 60 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. వీరి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు పదిహేడు మందిని ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్టు మాదాపూర్‌  జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి ³. కావేరి, డి.స్రవంతి, ప్రియాంక, ప్రసన్న, కావ్వ, మాధవి, బేబీ, సంగీత, గూడురు పాఠశాల నుంచి పి. ప్రియాంక, నల్లగొండ డైట్‌ స్కూల్‌ నుంచి అస్మా, పుష్పలత, కె.అనుప్రియ, ఇక్రారుమానా, భువనగిరి పాఠశాల నుంచి ఎం.తులసి, ఎస్‌.మాన్మిత, అమ్మనబోలు నుంచి కె.కళ్యాణీ, స్వేత ఎంపికైనట్లు తెలిపారు. వీరు  ఈ నెల 6 నుంచి 8వ తేది వరకు వరంగల్‌ జిల్లా హన్మకొండలోని జేఎన్‌ఎస్‌ స్టేడియంలో నిర్వహిచే  రాష్ట్రస్థాయి హ్యండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు హ్యాండ్‌ బాల్‌ అట  సంఘం కార్యదర్శి డి. ఆనంద్,  సయూక్త కార్యదర్శి బుగ్గ కేశనాగులు  తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement