పట్టణంలోని బావూజీ పేటలో నివాసముంటున్న హమాలి బుడ్డ వీరప్ప (46) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు.
వడ దెబ్బతో హమాలి మృతి
May 9 2017 11:01 PM | Updated on Oct 9 2018 2:17 PM
ఆదోని టౌన్: పట్టణంలోని బావూజీ పేటలో నివాసముంటున్న హమాలి బుడ్డ వీరప్ప (46) మంగళవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. వీరప్ప మార్కెట్ యార్డులో హమాలిగా పని చేసే ఇతను మార్కెట్ యార్డుకు అన్ సీజన్ కావడంతో కట్టెల తెచ్చేందుకు కొండకు వెళ్లాడు. కట్టెలు తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేస్తూనే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. మృతుడికి భార్య శంకుతల, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Advertisement
Advertisement