కొత్తగూడ మండలం దుర్గారం లక్ష్మిపురం శివారులో న్యూడెమోక్రసీ(రాయల వర్గం) పుల్లన్న దళంపై పెద్దచంద్రన్న వర్గానికి చెందిన సూర్యం, శ్యాం దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో పుల్లదళ భ్యులు వీరారెడ్డి(వీరన్న)తోపాటు మరో దళసభ్యుడికి గాయాలైనట్లు సమాచారం. గత కొంతకాలంగా న్యూడెమోక్రసీ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే.
ఎన్‌డీ దళాల మధ్య కాల్పులు
Sep 17 2016 12:30 AM | Updated on Oct 17 2018 3:43 PM
నర్సంపేట : కొత్తగూడ మండలం దుర్గారం లక్ష్మిపురం శివారులో న్యూడెమోక్రసీ(రాయల వర్గం) పుల్లన్న దళంపై పెద్దచంద్రన్న వర్గం సూర్యం, శ్యాం దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో పుల్లదళ భ్యులు వీరారెడ్డి(వీరన్న)తోపాటు మరో దళసభ్యుడికి గాయాలైనట్లు సమాచారం. గత కొంతకాలంగా న్యూడెమోక్రసీ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయం తెలిసిందే.
తమ ప్రాబల్యాన్ని విస్తరించడానికి ముస్మి ఏజేన్సీ ప్రాంతంలో రాయలవర్గం చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకునేందుకు శుక్రవారం రాత్రి సూర్యం దళం మాటుకాసి పుల్లన్న దళంపై దాడి చేసినట్లు తెలిసింది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కొత్తగూడ మండలంలో ఈ ఘర్షణతో అలజడి వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు ప్రారంభించినట్లు తెలిసింది.
Advertisement
Advertisement