గోవిందా...హరి గోవిందా | Govinda ... Govinda Hari | Sakshi
Sakshi News home page

గోవిందా...హరి గోవిందా

Dec 23 2016 6:39 PM | Updated on Sep 4 2017 11:26 PM

కడప నగరంలోని మున్సిపల్‌ మైదానం కల్యాణ శోభను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన వేదిక రంగురంగుల పందిళ్లతో ఆ ప్రాంగణం కళకళలాడింది.

– వైభవంగా శ్రీవారికి నిశ్చితార్థం
 కడప నగరంలోని మున్సిపల్‌ మైదానం కల్యాణ శోభను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణోత్సవం కోసం ఏర్పాటు చేసిన వేదిక రంగురంగుల పందిళ్లతో ఆ ప్రాంగణం కళకళలాడింది. శ్రీ గోవిందమాల భక్తుల సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు కల్యాణ నిశ్చితార్థ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు.  అర్చకులు అభిషేకం, తోమాలసేవ, గోపూజ, నిశ్చితార్థం, ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. సంగీత నృత్యాలతో కూడిన ఎదుర్కోలు కార్యక్రమం భక్తుల గోవిందమనామ స్మరణల మధ్య ఉల్లాస భరితంగా సాగింది. స్వామి, అమ్మవార్లకు శనివారం కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో గోవిందమాల ధారులైన భక్తులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. - కడప కల్చరల్‌

 కడప, శ్రీనివాసుని కల్యాణోత్సవం,తోమాలసేవ, kadapa, Srinivasuni kalaynaostavam, Tomalaseva
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement