సీమను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం | government neglect seema | Sakshi
Sakshi News home page

సీమను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

Feb 27 2017 10:25 PM | Updated on Sep 5 2017 4:46 AM

సీమను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

సీమను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం

రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు.

– బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి 
 
నంద్యాల: రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. నంద్యాల పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణంతో సీమ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉద్యోగాలన్నీ  కోస్తాంధ్రా వాళ్లకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై సీమకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చట్ట సభల్లో మాట్లాడడమే లేదని విమర్శించారు. కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారు.. శ్రీశైలం జలాలను ఖాళీ చేశారన్నారు. టీటీడీలో ఏడువేల ఉద్యోగాలను అన్ని జోన్‌ల వారికి కేటాయిస్తూ పూర్తి  చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రాయలసీమ వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. గుంతకల్లుకు రైల్వే జోన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేవారు. ఉద్యోగాలు రాకపోవడంతో డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టభద్రుల అభ్యర్థి నాగార్జున రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు రాధాకృష్ణ, కాలమిస్టు నారాయణ స్వామి, ఆర్‌వీఎఫ్‌ అధ్యక్షుడు రాజునాయుడు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement