25న తిరుమల ఆలయంలో గోకులాష్టమి | gokulashtami on 25 in srivari temple | Sakshi
Sakshi News home page

25న తిరుమల ఆలయంలో గోకులాష్టమి

Aug 19 2016 9:02 PM | Updated on Sep 4 2017 9:58 AM

తిరుమల ఆలయం వద్ద భక్తుల సందడి

తిరుమల ఆలయం వద్ద భక్తుల సందడి

తిరుమలలో ఈ నెల 25వ తేదీన గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో ఆస్థానం, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు.

 
– శ్రీవారి దర్శనానికి 8 గంటలు
సాక్షి,తిరుమల:
తిరుమలలో ఈ నెల 25వ తేదీన గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో ఆస్థానం, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం 26వ తేదీ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప సాక్షిగా ఆలయ పురవీ«ధుల్లో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. అదేరోజు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు రద్దుచేశారు. 
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 45,854 మంది శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 17 కంపార్ట్‌మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 8 కంపార్ట్‌మెంట్లలోని కాలిబాట భక్తులకు 6 గంటలు సమయం తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు.
 
 
 

Advertisement

పోల్

Advertisement